స్వర్గీయ వంగవీటి మోహన రంగా కారణజన్ముడు: జనసేన నేతలు

గుంటూరు: గుంటూరు పట్టణంలోని నల్లచెరువులో కాపు నాయకులు పుల్లంశెట్టి వెంకట్రావు ఆధ్వర్యంలో అమరజీవి స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు, గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్యలు పాల్గొన్నారు. ముందుగా నేతలు బోనబోయిన శ్రీనివాసరావు, నేరేళ్ళ సురేష్, ఉప్పు వెంకటరత్తయ్య లు వంగవీటి మోహన రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారికోసం పరితపించే మంచి మనిషి వంగవీటి మోహన రంగారావు గారని అన్నారు. ముఖ్యంగా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ వారిని అన్నివిధాలా అదుకుంటూ వుండేవారు. అందుకే రంగా గారిని ప్రజలు నేటికి అంత ఇష్టంగా అబిమానిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లోకి నేను రావటానికి ఆయనే స్పూర్తి అని అన్నారు. గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రంగా కేవలం శాసనసభ్యుడుగా పనిచేసింది కేవలం 3 సంవత్సరాలే అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ చెరగని ముద్ర వేసుకున్నారు. అయన చనిపోయి 35 సంవత్సరాలు అయినా నేటికీ ప్రజల ప్రేమాభిమానాలు పొందటం పూర్వజన్మ సుకృతం అన్నారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ శాంతి యుతంగా రంగారావు గారు పేదల సమస్యలపై ఆమరణనిరాహరాదీక్ష చేస్తున్న సమయంలో కసాయి గూండాల కత్తులకు బలికావటం పేద ప్రజల నేటికి మర్చిపోలేనిది. కనుకనే రంగా ఈభూమి ఉన్నంతవరకు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప ప్రజానాయకుడని అందుకే అయిన కారణజన్ముడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.