ఆర్థిక అసమానతల తగ్గింపే స్వర్ణాంధ్ర లక్ష్యం

స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు ప్రజల ఆశీస్సులు అవసరమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సమాజంలో కొన్నిదశాబ్దాలుగా పేరుకుపోయిన ఆర్థిక అసమానతలను తగ్గించడం స్వర్ణాంధ్ర 2047 ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. స్వర్ణాంధ్ర 2027 విజన్‌లోని పది సూత్రాల అమలులో భాగంగా, జీరో ప్రాపర్టీ – పి4 కార్యక్రమాన్ని 22వ డివిజన్ శ్రీనివాసరావు తోటలోని 70, 71, 72 సచివాలయాల పరిధిలో వార్డ్ సభల్లో చేపట్టారు.ఈ సభలు ఆర్.ఓ. రవికిరణ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఆళ్ళ హరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో విధ్వంసమైన వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోదీ సహాయంతో పునర్నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ చంద్రబాబు మస్తిష్కం నుంచి పుట్టినదని కొనియాడారు. ఈ కార్యాచరణలో ప్రధాన లక్ష్యం అట్టడుగు స్థాయి కడునిరుపేదలను అన్ని విధాలా అభివృద్ధిలోకి తీసుకురావడం అని వివరించారు. ఇందులో భాగంగా పేదలను గుర్తించేందుకు చేపడుతున్న సర్వేలు పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు.

బీజేపీ నాయకుడు అప్పిశెట్టి రంగా మాట్లాడుతూ, కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గేదెల నాగారంగమణి, నోడల్ ఆఫీసర్ హజారు వెంకటేశ్వరరావు, గేదెల రమేష్, టీడీపీ నాయకుడు మస్తాన్ వలి, జనసేన నాయకులు మెహబూబ్ బాషా, రెల్లి నాయకుడు సోమి ఉదయ్ కుమార్, సచివాలయ అడ్మిన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment