అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మరియు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాంతీయ వైద్యశాల అన్నమయ్య జిల్లా ఆర్చి వద్ద ప్లాస్టిక్ వాడకం తగిద్దాం, మట్టి పాత్రలకు ప్రాధాన్యత కల్పిద్దాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుదాం అంటూ స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికుల మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా, పూర్వ వినియోగ వస్తువులతో పాటు, ముఖ్యంగా మట్టితో తయారైన వస్తువులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని, మట్టి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాసు, డిపిఓ జ్యోతిబాబు, పలువురు కూటమి నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మల్లూరు సునీత, వెంకటేష్, రామచంద్రయ్య, చలపతి, చెన్నకృష్ణ, శివ ఛాన్ బాషా, ప్రభుత్వాధికారులు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this content:
Post Comment