జనసేనానిపై ఆలీ వ్యాక్యలను ఖండించిన సయ్యద్ నాగుర్ వలి

నకరికల్లు మండలం జనసేన కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జనసేన నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ నాయకులు ఆలీ చేసిన వ్యాక్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు ఆలీ మీ స్థాయికి మించి మాట్లాడడం కరెక్టు కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీ పట్ల ఎంతో ఆరాధన అభిమానం చూపారు. దీంతో జన సైనికులు అందరూ కూడా మిమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని స్థాయికి మించి మాట్లాడటం కరెక్ట్ కాదని జనసేన నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్
సయ్యద్ నాగుర్ వలి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీపై ఉన్న గౌరవం తగ్గే విధంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు, పవన్ కళ్యాణ్ పై మీ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని పోటీ చేసి గెలవమని సవాల్ విసిరారు. మరొకసారి మీరు స్థాయికి మించి కామెడీ డైలాగులు మీడియా ముందు మాట్లాడితే సహించేది లేదని సయ్యద్ నాగుర్ వలి హెచ్చరించారు.