అహుడా చైర్మన్ & అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ జన్మదిన వేడుకలు కళ్యాణదుర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం కోట వీధిలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద టీసీ వరుణ్ పేరు మీద ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. తదనంతరం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించి, కేక్ కటింగ్ చేసి వేడుకలను మరింత వేడిగా జరిపారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని టీసీ వరుణ్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న టీసీ వరుణ్ గారు మరిన్ని విజయాలు సాధించాలని జనసేన కార్యకర్తలు ఆకాంక్షించారు.
Share this content:
Post Comment