జనవాణిలో చిల్లపల్లిని కలిసిన తాడేపల్లి క్యాడర్

–హలో మంగళగిరి ఛలో పిఠాపురంకు పిలుపు

శుక్రవారం ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమంలో ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రజల సమస్యలు విని అర్జీల స్వీకరించారు. అదే సమయంలో తాడేపల్లి నుండి వందలాదిగా కార్యకర్తలు తరలివచ్చి చిల్లపల్లిని కలిసి పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ఫ్రేమ్ ని బహూకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దశాబ్ద కాలానికి పైగా ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత జగన్ మోహన్ రెడ్డికి లేదని, ప్రజల విశ్వాసం కోల్పోయి 151 నుండి 11 కి పడిపోయారని, ఇలా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే సున్నాకి పడిపోతారని హెచ్చరించారు. మార్చి 14న జరిగే 12వ ఆవిర్భావ దినోత్సవానికి లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని సూచించారు. తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతిరావు, జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ కోటేష్ బాబు ఆధ్వర్యంలో ఇంతమంది వచ్చి కలవడం ఆనందంగా ఉందని, మంగళగిరి నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామని, తాడేపల్లి పట్టణ రూరల్ తో సహా మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా వీర మహిళలు, జనసైనికులు, విద్యార్థినీ విద్యార్థులు, కార్మికులు,కర్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు జనసైనికులు హలో మంగళగిరి ఛలో పిఠాపురం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment