తాడేపల్లిగూడెం జనసేనలో భారీ చేరికలు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పట్టణ మాజీ అధ్యక్షులు దాగరపు నాగు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ వికృత చేష్టలకు ప్రజలు భయపడి జనసేన పార్టీలోకి వస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాసు తెలిపారు. అయినతో పాటు తన అనుచరులను బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో ఉన్న ఎరుకల సంఘం వారు కూడా బొలిశెట్టి చేసే సేవా కార్యక్రమాలను మెచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, నియోజకవర్గం లోనూ దాచుకోవడం దోచుకోవడం అనే విధంగా తయారయిందని ప్రభుత్వంపై మండిపడ్డారు, నియోజకవర్గంలో మంత్రి చేసే అరాచకాలు తట్టుకోలేక వైఎస్ఆర్సిపి పార్టీని విడి జనసేనలోకి వస్తున్నారని ఆయన తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే గూడెంలో ఆగిన అభివృద్ధి కొనసాగిస్తానని, గూడెంలో శాంతియుత వాతావరణం ఉండేలా చూస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం వారు, దాగరపు వాసు వారి అనుచరులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.