పిఠాపురం మండలం చిత్రాడలో జరగనున్న జయకేతనం సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, వీర మహిళలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన యువనాయకుడు బొలెశెట్టి రాజేష్ మాట్లాడుతూ, జనసేన పార్టీ 12 ఏళ్ల కష్టం గత ఏడాది ఫలించిందని, అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఎంతో ప్రాధాన్యమున్నదని పేర్కొన్నారు. నాడు ప్రశ్నించిన జనసేన, నేడు పాలన చేస్తోందని, ఈ వేడుకలను పండుగ వాతావరణంలో జరిపించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 300 కార్లు, 40 బస్సుల్లో జనసైనికులు జయకేతనం సభకు తరలి వెళ్తున్నారని, సభకు సురక్షితంగా వెళ్లి, సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆవేశాలను ప్రపంచం గుర్తిస్తోందని, సినిమాల కంటే రాజకీయంగానే పవన్‌కు ఆదరణ పెరిగిందని బొలెశెట్టి రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, పుల్లా బాబి, అడపా ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, కేశవభట్ల విజయ్, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకటరామయ్య, రౌతు సోమరాజు, నీలపాల దినేష్, బైనపాలేపు ముఖేష్, యంత్రపాటి రాజు, చాపల రమేష్, నల్లగంచు రాంబాబు, గుండుమొగుల సురేష్, కాళ్ల గోపికృష్ణ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, కసిరెడ్డి మధులత, మధుశ్రీ నాయుడు, లక్ష్మీ ప్రసన్నతో పాటు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment