జనసేన పార్టీలో చేరిన తాడేవీధి గ్రామ పెద్దలు

ఆల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేనపార్టీలో చేరిన బీరం పంచాయితీ పరిదిలోని తాడేవీధి గ్రామ పెద్దలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ పాడేరు ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్యతో గంటన్నర సమయంపాటుగా గిరిజన రాజకీయాలు ప్రస్తుత అస్తిరమైన వ్యవస్థల నాశనంపై గిరిజన ప్రజల భవిష్యత్తు ఏమిటనే అనేక అంశాలకు సంబందించి చర్చించారు. గిరిజనులపై ప్రస్తుత ప్రభుత్వం అవ్యాజ ప్రేమ కనబరుస్తూనే వారి మనుగడపై అంతర్గత దాడులు చేసే సంస్కృతికి తెరాలేపిందనీ అందులో భాగంగానే సంస్కృతీ, సభ్యత, భాష వైవిద్యం జీవన విధానాలు, అనేకంషాలకు సంబందించిన గత ప్రభుత్వాలు గిరిజనప్రజల జీవన విధానాన్ని గొప్ప హెరిటేజ్ కల్చర్ గా తీర్చిదిద్దవలిసిందిపోయి నాశనం చేస్తూ పోతుంటే పసిగట్టలేని అసమర్థ స్థితిలో గిరిజన యువత లేదన్నది మాకున్న స్పష్టమైన ఆలోచనన్నారు. అలాగే చాలా విషయాలలో రిజర్వేషన్ అవకాశాలు ఉండికూడ మనకు రక్షణ కల్పించే వ్యవస్థలను బలహీనపరిచి దానిని రాజకీయం చేస్తూ మేమొస్తే ప్రత్యామ్నాయ పరిస్కారం ఆలోసిస్తామనడం ఎంతవరకు సబబన్నారు ఇదిగాక అధికారంలో ఉన్నప్పుడు మన జీవోలని కాపాడే ప్రయత్నం చెయ్యకుండా ఎన్నికలొస్తుంటే అటువంటి గిరిజన రక్షణ, ఉద్యోగ జీవోలని ఎన్నికలతో ముడిపెట్టి చూడటం విచిత్రమైన రాజకీయలన్నారు. గ్రామస్తులందరు జనసేన పార్టీ ఆశయాలు, లక్ష్యాలు నచ్చి మేము జనసేనపార్టీ కి చేరుతున్నామని వచ్చే ఎన్నికలలో తప్పకుండా జనసేన పార్టీ వెంటే ఉంటామన్నారు. ఈ చేరికకు తల్లే త్రిమూర్తులు కృషి అభినందించారు. ఈ కార్యక్రమంలో తల్లే త్రిమూర్తి, మసాడి సింహాచలం, నందోలి మురళి కృష్ణ పాడేరు మండల అధ్యక్షులు, అనర్బ గ్రామస్తులు హాజరయ్యారు.