తాడి పొన్నమ్మకు నివాళులర్పించిన పితాని

ముమ్మిడివరానికి చెందిన స్వర్గీయ తాడి తాతారావు సతీమణి మరియు తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు తాడి నరసింహారావు తల్లి అయిన తాడి పొన్నమ్మ పెద్దకార్యంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, దూడల స్వామి, పితాని రాజు, దొమ్మేటి ప్రసాద్, వంగా సీతారాం, గుత్తుల శంకర్ విత్తనాల రవితేజ తదితరులు పాల్గొన్నారు.