మహాత్ముడికి తాడిపత్రి జనసేన ఘన నివాళులు

తాడిపత్రి నియోజకవర్గం: జాతిపిత మహాత్మ గాంధీజీ జయంతి సందర్భంగా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ లో ఉన్న గాంధీజీ విగ్రహానికి తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షలు కుందుర్తి నరసింహచారి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్ అయూబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మణికంఠ, కార్యదర్శులు ఇమామ్ వలి, శివారెడ్డి, పవన్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.