మంగళగిరిలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

మంగళగిరి ఈద్గా షాదీ మహల్ లో అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం టైలర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నాగుల మీరా అధ్యక్షత వహించారు. వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు ఎన్.డి.ఏ కూటమి నాయకులు హాజరయ్యారు.

సభలో మహిళా టైలర్, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ చిత్రాన్ని వస్త్రంపై ఎంబ్రాయిడింగ్ చేసిన చిత్రాన్ని ఆవిష్కరించారు. తొలుత కుట్టు మిషన్ ప్రదాత విలియమ్స్ హోవే చిత్రపటానికి అసోసియేషన్ నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… గతంలో టైలర్ వృత్తిలో పురుషులు మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారని కూటమి ప్రభుత్వం అందరి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. టైలర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల అధికారంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కల్లుగా చేసుకొని పరిపాలన చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్, పింఛన్ పెంపుదల, ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు, రోడ్లు పునర్నిర్మాణం తోపాటు అమరావతి, పోలవరం పనుల్లో ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో జూన్ నుంచి తల్లికి వందనం అమలుపరుస్తామని చెప్పారన్నారు. టైలర్స్ అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో మూడు వేలకు తగ్గకుండా కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. టైలర్స్ కు కార్పొరేషన్, 50 సంవత్సరాలు నిండిన టైలర్స్ కు పింఛన్లు వంటి కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, జనసేన నాయకులు చిట్టెం అవినాష్, మాజీ మంగళగిరి మున్సిపల్ చైర్మన్ మరియు జనసేన నాయకులు గంజి చిరంజీవి, టీడీపీ గుంటూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు కంచర్ల కాశయ్య, సిపిఎం నాయకులు పిల్లలుమర్రి బాలకృష్ణ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, కోశాధికారి చాదరాసుపల్లి భాస్కర్, నాయకులు నల్లమోలు సుబ్రహ్మణ్యం, తిరువీధుల భావన్నారాయణ, షేక్ రజాక్, బాపనపల్లి అంజయ్య, మర్రి శివ బ్రహ్మం, పఠాన్ నాగూర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment