జనసేన పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం మండల ఎం.పి.డి.ఓకి వినతి
కళ్యాణదుర్గం, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముద్దలాపురం రామాంజనేయులు ఫిర్యాదుతో బ్రహ్మసముద్రం మండలంలోని, కన్నేపల్లి పంచాయతీకి సంబంధించిన ముద్దలాపురం గ్రామంలో పారిశుద్ధ్యంకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జనసేన నియోజకవర్గ నాయకులు వి.హెచ్.రాయుడు బ్రహ్మసముద్రం మండల ఎంపీడీవో నందకిషోర్ ని మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రమును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముద్దలాపురం గ్రామంలో పారిశుద్ధ కార్మికుని నియామకం లేక గ్రామంలోని మొత్తం పాఠశాల వద్ద, నీటి ట్యాంకుల వద్ద, ప్రధాన రహదారుల్లోనూ ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త వంటి వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతో పాటు పిచ్చి ముక్కలు కూడా విరివిగా పెరుగుతున్నాయని బ్రహ్మసముద్రం మండల ఎంపీడీవో నందకిషోర్ దృష్టికి తీసుకెళ్లి, గ్రామంలోని పారిశుధ్యంపై తగిన చర్యలు తీసుకొని, నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేయడం జరిగింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేసిన వెంటనే ఎంపీడీవో నందకిషోర్ స్పందించి తమ సిబ్బందితో మాట్లాడి నివారణ చర్యలు చేపట్టి, వ్యర్థ పదార్థాలను మొత్తం తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా తమ విధి నిర్వహణకు సంబంధించి బ్రహ్మసముద్రం మండల ఎంపీడీవో నందకిషోర్ గారి పనితీరును ప్రశంసిస్తూ, ఎంపీడీవోతో పాటు సిబ్బందికి జనసేన నాయకులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
Share this content:
Post Comment