విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టండి

  • పవనన్న ప్రజాబాటలో నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 9 వ రోజున ఆత్మకూరు టౌన్ నందు జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్ ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వేసవి తీవ్రత తగ్గి వాతావరణం మారి శీతాకాలం వస్తోందని, ఈ క్రమంలో ప్రజలకు విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతేడాది ఇదే సమయంలో ఆత్మకూరు టౌన్ లో అనేకమంది డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడిన సంగతిని గుర్తు చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నిరంతరం శానిటేషన్ చేస్తూ ఉండాలని, కాలువల్లో డ్రైనేజి వ్యర్ధాలు లేకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఇప్పటి నుండే తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని, తమ సూచనను అధికారులు సహృదయంతో స్వీకరించి విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురేంద్ర, చంద్ర, వంశీ, పవన్, హజరత్, ప్రసాద్, అనిల్, ప్రశాంత్, ఏడుకొండలు, భాను కిరణ్ తదితరులు పాల్గొన్నారు.