రోడ్డ మరమ్మత్తులు చేపట్టండి: జనసేన వినతి పత్రం

  • జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన డబ్బులు పొన్నలూరు మండలంలో కనిపించడం లేదు
  • పొన్నలూరు నుండి విప్పగుంట, పెద్దవెంకన్నపాలెం, ఎడ్లూరుపాడు రోడ్డు మరమ్మత్తులు చేయాలి
  • పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ ఏఈ కి జనసేన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
  • పొన్నలూరు వైసిపి నాయకులు మీరు కాస్త ప్రజల మీద దృష్టి పెట్టండి

కొండెపి: పొన్నలూరు నుండి విప్పగుంట, పెద్దవెంకన్నపాలెం, ఎడ్లూరుపాడు, గ్రామాలకు పోవు ప్రధాన రహదారి అద్వాన స్థితిలో ఉంది, ఇటీవల కురిసిన వర్షాలకి గుంతలమయం అయింది, పైగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు విపరీతంగా పెరిగి ఉన్నాయి, వారంలో రెండు మూడు యాక్సిడెంట్లు ఈ రహదారిలో జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించడానికి వెళ్లిన జనసేన నాయకుల దృష్టికి ఈ మూడు గ్రామాల ప్రజలు ఈ రోడ్డు పరిస్థితి చెప్పుకొని బాధపడడం జరిగింది. పొన్నలూరు మండలంలో వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదు, నిమ్మకు నీరు ఎత్తినట్లుగా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సోద్యం చేస్తూ ఉన్నారు, ప్రజలను అభివృద్ధి చేయడం లేదు. పొన్నలూరు నుండి విప్పగుంట, ఎడ్లూరుపాడు, పెద్దవెంకన్నపాలెం వెళ్ళు ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చి, ఇరువైపుల చెట్లు కొట్టి, మరమ్మత్తులు చేసి, ప్రజల ప్రాణాలు కాపాడాలని శనివారం పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులకు జనసేన పార్టీ నుండి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఖాజావలి, పీటర్ బాబు, సుబ్రహ్మణ్యం నాయుడు, తిరుమల్ రెడ్డి, ఆంజనేయులు, భార్గవ్, చందు మొదలైన జనసేన నాయకులు పాల్గొన్నారు.