ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం..!

యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా, ముఖ్యంగా మహిళలు తలదించుకునేల లిక్కర్ స్కామ్ లో తీహారు జైలుకు వెళ్లొచ్చిన ఒక నాయకురాలు కూడా జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆయన పది సంవత్సరాలు కష్టపడి ప్రజల్లో తిరిగి ప్రజల ప్రేమానురాగాలు పొంది ఈ స్థాయికి వచ్చారు తప్ప, మీలాగా నామినేటెడ్ పోస్టులను తీసుకోలేదు అనే విషయం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంతమంది నాయకులు వారి సొంత ఐడెంటిటీని కోల్పోతున్నాం అనుకునే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మళ్ళీ జనాల్లో ఫోకస్ అవ్వాలని ట్రై చేయడం బాగా అలవాటు అయిపోయింది ఇంకొక్కసారి ఎవరైనా మా అధినేత గురించి తప్పుగా మాట్లాడితే మా పద్ధతిలో తప్పక గుణపాఠం చెప్పవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాము. మీరు చేసిన పనులకి యావత్ తెలంగాణ ప్రజలు గద్దె దించి పక్కన కూర్చోబెట్టారు, రానున్న రోజుల్లో డిపాజిట్ కూడా రాకుండా గల్లంతైపోతారు గుర్తుపెట్టుకోండని తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ హెచ్చరించారు.

Share this content:

Post Comment