తలసేమియా బాధితులకు సహాయం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సేవను గుర్తించి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రాఘవరం రెడ్డి చేతుల మీదుగా జనసేన మధిర నియోజకవర్గ నాయకుడు తాళ్లూరి డేవిడ్ సత్కారం పొందారు. ఈ సందర్భంగా తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృక్పథాన్ని అనుసరిస్తూ, “మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో తలసేమియా బాధితులను ఆదుకునేందుకు అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించామని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 రోజులకు రక్త మార్పిడి అవసరమని డాక్టర్లు సూచించారని, వారి ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వం పింఛన్ రూపంలో సహాయం అందించాలని డేవిడ్ కోరారు.
Share this content:
Post Comment