‘సమంత బర్త్‌డే’ సీడీపీని రిలీజ్ చేసిన తమన్నా

‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఆ సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. అంతేకాదు తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది. కాగా ఈరోజు సమంత తన 34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్స్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు విషెస్ అందిస్తున్నారు. సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ రిలీజ్ చేయగా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని క్రియేట్ చేశారు. అలాగే సౌత్ రాజ్యానికి సామ్ ను క్వీన్ లా చూపిస్తూనే సీడీపీలో ఆమె నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలు కూడా పొందుపరిచారు. అదే విధంగా మాస్క్ ధరించి ఆరోగ్యంగా ఉండాలంటూ ట్యాగ్స్ తో అవగాహన కల్పించేలా ప్రయత్నం చేశారు. ఈ సీడీపీ ఆకట్టుకుందటుంది.