జయహో బిసి కార్యక్రమానికి హాజరైన తంబళ్లపల్లి రమాదేవి

నందిగామ నియోజకవర్గం: వీర్లపాడు మండలం, పొన్నవరం గ్రామంలోని టిడిపి పొన్నవరం గ్రామం నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జయహో బిసి కార్యక్రమానికి మాజీ శాసనసభ సభ్యురాలు మరియు టిడిపి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య మరియు కడియాలపు నరసింహారావు మరియు ప్రమోద్ ఆహ్వానం మేరకు నందిగామ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ బీసీ మరియు బడుగు బలహీన వర్గాల వారికి ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని, బీసీ కార్పొరేషన్ నిధులు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులను నవరత్నాల పేరిట దారి మళ్లించి దోచుకున్నారని, వైసిపి పార్టీకి ఎవరైతే సానుభూతిపరులు ఉన్నారో వారికి మాత్రమే పథకాలు అందేలా చేస్తూ, ఆ నవరత్నాలు కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు ఆ పథకాలు అందించడంలో విఫలమయ్యారు అని ఎద్దేవా చేశారు. బీసీ కార్పొరేషన్లు, మరియు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను ఇలా వారి పార్టీ పథకాలకు ఉపయోగించుకోవడానికి వారికి ఎవరిచ్చారు హక్కు అని ప్రశ్నించారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మీ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల యొక్క నిరసన సెగ వారికి తెలుస్తుండటంతో, అప్రమత్తమై నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇంక మీరు ఎటువంటి కుతంత్రాలు కుట్రలు కుతంత్రాలు పన్నిన మీ వలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడరని తెలియజేశారు సభకు విచ్చేసిన ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీర్లపాడు మండల అధ్యక్షుడు బేతన్పూర్ జయరాజు పొన్నవరం గ్రామ సర్పంచ్ పసుపులేటి శీను మరియు అజయ్ కుమార్, సందీప్, అఖిల్, పవన్ ఆర్మీ నాగేంద్ర, కేదార్ మరియు టిడిపి నాయకులు గువ్వల సత్యం, రాహుల్, అల్లరి కోటేశ్వరరావు, కోయ సాయిరాజు, శ్రీనివాసరావు వెంకట్రావు, చిట్టిబాబు జనసైనికులు టిడిపి కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.