ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ప్రతిపక్ష హోదాకే కాదు కనీసం ప్రజాప్రతినిధిగా కూడా అర్హత లేని దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండించిన నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే సభా గౌరవాన్ని తుంగలో తొక్కి ధర్నా చేపట్టిన మీరు ప్రతిపక్ష హోదా అడగటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలు తీసుకొని మౌనంగా ఉంటున్నారని అబద్దపు అభియోగాలను చేస్తూ అసత్యాలు పలుకుతున్న దువ్వాడ శ్రీనివాస్ నాలుక చీరుస్తామని హెచ్చరించిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో మీరు అంధకార ఆంధ్ర ప్రదేశ్ గా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అభివృద్ధి పదంలో అడుగులు వేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అడ్డుపడటానికే ప్రతిపక్ష హోదా ఆశిస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్న వైసిపి పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. 18 మంది సభ్యులు లేని మీరు ప్రతిపక్ష హోదా కోరుకోవడం మీ అవివేకానికి ఇదొక నిదర్శనంగా భావిస్తున్నాము. గత ఐదు సంవత్సరాలుగా మీ పాలన చూసి ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే భవిష్యత్తులో కేవలం ఒక్క సీటు మాత్రమే మీకు ఇచ్చి మరోసారి ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపెడతారని రమాదేవి అన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే ప్లకార్డులు పట్టుకొని నిండు సభలో సభా గౌరవాన్ని తుంగలో తొక్కి మీరు చేసిన చర్యను రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ చర్యకు తగిన శాస్తి మీకు జరిగే తీరుతుందని రమాదేవి హెచ్చరించారు.
Share this content:
Post Comment