పలు కుటుంబాలను పరామర్శించిన తంబళ్ళపల్లి రమాదేవి

నందిగామ, కంచికచర్ల మండలం మరియు వీర్లపాడు మండలంలోని పలు జనసైనికుల కుటుంబాలను నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పరామర్శించడం జరిగింది. కంచికచర్ల మండలం, కునికినపాడు గ్రామంలోని జనసైనికుడు మంగిశెట్టి శరత్ ఆత్మహత్య చేసుకుని మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి తంబళ్ళపల్లి రమాదేవి పరామర్శించారు. అనంతరం వీర్లపాడు మండలం, బోదవాడ గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు రెంటపల్లి మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని మరణించగా వారి కుటుంబ సభ్యులను తంబళ్ళపల్లి రమాదేవి పరామర్శించారు. ఇరు కుటుంబాలకు జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు తెలియపరచండి అనీ, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మరియు వీర్లపాడు మండల అధ్యక్షులు నాయిని సతీష్ మరియు బేతపూడి జయరాజు మరియు కునికినపాడు గ్రామ సర్పంచ్ బండారుపల్లి సత్యనారాయణ జనసేన నాయకులు దేవి రెడ్డి శ్రీనివాసరావు, కంభంపాటి తిరుమలరావు, ఎర్రబడి సురేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment