ముఖ్యమంత్రికి తంబళ్ళపల్లి రమాదేవి రెప్రెసెంటేషన్

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, చందర్లపాడు మండలం, ముప్పాళ్ళ గ్రామం నందు దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి నందిగామ నియోజకవర్గంలోని ప్రజలు మరియు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన పార్టీ తరఫున కూటమినేతలతో కలిసి సీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. అందులో ముఖ్యమైన సమస్య వేదాద్రి – కంచల ఎత్తిపోతల పథకం మూలన పడి ఆరేళ్లు అవుతోందని, వైకాపా ప్రభుత్వంలో మోటార్ల మరమ్మత్తులకు కూడా నిధులు ఇవ్వలేదని తెలియపరిచారు. మోటార్లు తుప్పు పట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని, ఆయకట్టుకు సాగునీరు లేక పంటలు పండక అన్నదాతలు నష్టపోతున్నారని, కూటమి ప్రభుత్వం రాకతో, వేదాద్రిపై అన్నదాతల్లో ఆశలు చిగురించాయనీ వివరించారు. ఈ వేసవిలోనే నిధులు మంజూరు చేసి మరమ్మత్తులు చేయించాలని రైతులు కోరుతున్నారని, గతంలో వేదాద్రి వద్ద కృష్ణ నదిపై ఈ పథకాన్ని ఫేజ్ – 1, ఫేజ్ -2 గా ఏర్పాటు చేయడం ద్వారా 17 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అయ్యి జగ్గయ్యపేట నియోజకవర్గంలో మూడు గ్రామాలకు, నందిగామ, చంద్రపాడు మండలంలో 32 గ్రామాల పరిధిలోని రైతులకు సాగు నీరు రావడంతో నియోజకవర్గం లోని పంటలు సస్యశ్యామలం ఉండేవని చెప్పారు, వైకాపా ప్రభుత్వం రావడంతో ఈ పథకంపై చిల్లిగవ్వ కేటాయించలేదనీ, క్రమంగా నాలుగు మోటర్లకు మరమత్తులు చేయకపోవడం తో పధకం పూర్తిగా మూత పడిపోవడంతో, మోటార్లు ,ఇతర సామాగ్రి పాడై పోతున్నాయని రమాదేవి వివరించారు, విద్యుత్ సరఫరా సబ్ స్టేషన్ సైతం కంప చెట్లలో కనిపించట్లేదని, సబ్ స్టేషన్ సామాగ్రి దెబ్బతింటుందని, ఇదేవిధంగా కొన్నాళ్ళు పాటు ఉంచితే పరికరాలు పనికిరాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనీ, వచ్చే ఖరీఫ్ కల్లా మరమ్మత్తులు చేసి ఎత్తిపోతల పథకం సిద్ధం చేస్తే, అన్నదాతలకు సాగు నీటి సమస్య తీరుతుందని రాతపూర్వకంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకి రమాదేవి సమర్పించారు. అంతేకాక నియోజకవర్గంలోని మరికొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అందులో కంచికచర్ల మండలం ప్రజలకు తాగునీరు మరియు డ్రైనేజీ సమస్య ఉన్నదని, కంచికచర్ల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ చేయగలరని, చెవిటికల్లు పైలెట్ ప్రాజెక్టు ద్వారా అవసరం మేరకు కొన్ని నూతన నీటి ట్యాంకులను నిర్మించిన యెడల కంచికచర్ల మండలంలోని ప్రజలకు నీటి సమస్యను తీర్చే అవకాశం ఉన్నదని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment