పవన్ కళ్యాణ్ రిప్లై తో సంబరపడిన తమిళ్ హీరో..

సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ పుట్టినరోజు కు నెల రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ హంగామా చేశారు. ఇక పుట్టినరోజు నాడు ఆయన అభిమానులు చేసిన రచ్చ మాములుగా లేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, సెలబ్రెటీలు పవర్ స్టార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపధ్యం లో తమిళ హీరో శివకార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా పవన్ కి విషెస్ తెలిపాడు. అయితే తనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ పవన్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ సమాదానాలుఇచ్చారు. అలాగే, శివకార్తికేయన్ కి కూడా రిప్లై ఇచ్చారు. ‘ప్రియమైన తిరు శివ కార్తికేయన్, మీరు పంపిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. మీరు ఎన్నో విజయాలు సాధించాలని అభిలషిస్తున్నాను. ఇక, మీ ‘ఊదా కలర్ రిబ్బన్..’ అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటని లెక్కలేనన్నిసార్లు చూశాను’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

అయితే తను చెప్పిన విషెస్ కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లై చూసి ఆ తమిళ హీరో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయ్యాడు. వెంటనే, మళ్లీ జవాబు ఇస్తూ, ‘మీ జవాబు చూసి అమితానందాన్ని పొందాను సార్. ఊదా కలర్ రిబ్బన్ పాట మీకిష్టమని తెలిసి మరింత ఆనందాన్ని పొందాను. మీరు సమయాన్ని వెచ్చించి నాపై ప్రేమ చూపుతూ జవాబు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుడిని సార్’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ విధంగా శివ కార్తికేయ పవన్ కళ్యాణ్ రిప్లై చూసి తెగ సంబరపడిపోయాడట…