కరోనాతో తమిళ నిర్మాత వీ. స్వామినాథన్ మృతి

ప్రముఖ తమిళ నిర్మాత వీ. స్వామినాథన్ కరోనా కారణంగా మరణించారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఈ రోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లక్ష్మీ మూవీ మేకర్స్‌ లో స్వామినాథన్ కూడా ఒకడు. ఈయనతో పాటు ఆ నిర్మాణ సంస్థలో కె మురళీధరన్, వేణుగోపాల్‌ భాగస్వాములుగా ఉన్నారు. వీరి నిర్మాణంలో ‘అరణ్‌ మనై కావలన్‌’ అనే సినిమాను తొలిసారిగా 1994లో నిర్మించారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలను నిర్మించడమే కాక  ఈయన కొన్ని సినిమాలో నటించారు. స్వామినాథన్‌ మృతికి పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపo తెలియజేసారు.