కేసులు తారుమారు చేస్తే సహించేది లేదు: మాకినీడి శేషుకుమారి

  • నింధుతులకు కఠిన శిక్ష పడవలసిందే

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఇటీవల ఉప్పాడ కొత్తపట్నంకి చెందిన జనసేన కార్యకర్త చెక్కా దుర్గా ప్రసాద్ దండగురుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం విధితమే. అయితే గాయపరచిన దుండగులు మీద స్థనిక కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఎటెంప్టివ్ మర్డర్ కేసు నమోదు చేయకుండ సింపిల్ గా ఉండే పెట్టీ కేసుగా నమోదు చేయడంతో జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ మాకీనీడి శేషకుమారి మండిపడ్డారు. న్యాయవాది సిరిపిరెడ్డి గణేష్ ని స్టేషన్ కి తీసుకుని వెళ్ళి ఆరా తీయగా పైవిధంగా చెప్పడం జరిగింది. వీటిని కేసును తప్పుత్రోవ పట్టిస్తున్న పోలీస్ వారు తమ కార్యాకర్తకి న్యాయం చేయకపోతే నియోజకవర్గ కార్యకర్తలను జనసైనికులను కలుపుకుని పోరాటం చేస్తామని, బాధితుడి సంబందించిన మహిళను చీరలాగి జాకెట్ చించి అగౌరపరిస్తే పెట్టి కేసులా కట్టడం అనేది ఎంతవరకు న్యాయమే పోలీసు వారు ఆలోచించాలని మా కార్యకర్తపై జరిగింది అటెంప్టివ్ మర్డర్ దానికి సంబందించిన సెక్సన్ నమోదు చేయకుండా నీరుకార్చడం మంచి పద్దతి కాదని కఠినమైన సెక్సన్ క్రింద కేసు నమోదు చేయాలని పోలీసు వారిని హెచ్చరించారు. ఆమెతో యు కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, నాయకులు జనసైనికులు బాధ్యత కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.