టంగుటూరు – కొండపి ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలి: జనసేన డిమాండ్

  • మేడిపండు లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటున్న కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలంలో టంగుటూరు నుండి కొండపి వరకు వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా గుంతలగుంతలుగా మారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, నిత్యం ఈ ప్రధాన రహదారి ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది, ఎన్నికలకు ముందు వైసిపి నాయకులు అడ్డు అదుపు లేకుండా హామీలు ఇచ్చి, ఈరోజు అభివృద్ధిని గాలికి వదిలేసారు, బటన్ లు నొక్కుతూ ఉన్నాను అంటూ మాయ మాటలు చెబుతూ ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు మాత్రం ఖచ్చితంగా గద్దె దించడం జరుగుతుంది. ఈ రహదారిలో ఇటీవల కాలంలో కొండపిలో వైసిపి ఇన్చార్జ్ 5 ట్రాక్టర్ల మట్టి తోలించి, పబ్లిసిటీ ఆర్భాటాల్లో ముందు వరుసలో ఉన్నారు, ఇప్పుడు ఆ రహదారిని చూస్తూ ఉంటే గుంతల్లో రోడ్డుని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, మేడిపండు లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె ధించి, జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వంను ఏర్పాటు చేస్తాం, ఈ ప్రధాన రహదారి సమస్యను టంగుటూరు మండలం జనసేన పార్టీ నాయకులు బడుగు నాగార్జున, సనగర రాజేష్, అత్యల సురేష్, వరికూటి చిరంజీవి మొదలైన వారు జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం అధిష్టానం దృష్టికి తీసుకురావడం జరిగింది, నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న జనసైనికుడు బడుగు నాగార్జున, ఈ రహదారిని మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అంటూ కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండలం అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్, మండలం యూత్ లీడర్ బడుగు నాగార్జున, ప్రధాన కార్యదర్శి సనగర రాజేష్, ప్రధాన కార్యదర్శి అత్యల సురేష్, కార్యదర్శి వరికూటి చిరంజీవి, క్రాంతి, రజనీకాంత్, రమేష్, సందీప్, మధుసూదన్, వంశి, కోటేశ్వరరావు, భార్గవ్, సన్నీ బాబు, దినేష్, బద్రి, కోటయ్య, ఆదిత్య, వివియన్, కిషోర్, వెంకట సురేష్, కోటేశ్వరరావు, శివ, శ్రీనివాస్, నాగరాజు, ప్రవీణ్ కుమార్, కిరణ్ బాబు, శివ, అహయ్ సేన, మరియు కొంతమంది జనసైనికులు పాల్గొన్నారు.