విజయ్ దేవరకొండను హోల్డ్ లో పెట్టిన తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ స్టార్ డం ఒక్క రెంజ్ లో మారిపోయింది. ఇలాంటి సమయంలో తరుణ్ భాస్కర్ మాత్రం ఛాన్స్ ల కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పెళ్లి చూపులు సమయంలోనే విజయ్ దేవరకొండతో మరో సినిమాను అనుకున్నాను. ఆ తర్వాత విజయ్ స్టార్ డం పెరగడంతో అది సాధ్యం కాలేదు. నేను ఎప్పుడు అంటే అప్పుడు విజయ్ డేట్లు ఇచ్చేందుకు రెడీగా ఉంటాడు. కాని నాకు కొత్త వారితో సినిమా చేయడమే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే విజయ్ దేవరకొండ ఆఫర్ ను హోల్ట్ లో పెట్టినట్లు తరుణ్ భాస్కర్ సన్నిహితుల వద్ద అన్నాడట. తనకు ఆఫర్లు లేని సమయంలో ఖచ్చితంగా విజయ్ దేవరకొండను కలిసి సినిమా చేద్దామని అడుగుతాను. అప్పుడు తప్పకుండా ఆయన నాకు డేట్లు ఇస్తాడని చెబుతున్నాడు. వీరిద్దరి కాoబినేషన్ కోసం మరికొంత కాలం ఎదురు చూడాలల్సిందే.