త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తరుణ్

ఎన్నో తెలుగు సినిమాల్లో బాల నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరో తరుణ్ `నువ్వే కావాలి` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. తరుణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, భలే దొంగలు, శశిరేఖా పరిణయం ఇలా ఎన్నో సినిమాలు చేసి లవర్ బాయ్‌గా స్టార్ డమ్ అందుకున్నాడు.

అయితే ఆ స్టార్ డమ్ ఎక్కువ కాలం నడవలేదు ఆ తర్వాత తరుణ్ ఏ సినిమా చేసినా.. ఫ్లాప్ అవ్వడంతో పాటు కొత్త హీరోల ఎంట్రీ తో తరుణ్ కు అవకాశాలు తగ్గిపోగా.. తర్వాత తరుణ్ బిజినెస్ చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయాడు. తాజాగా తరుణ్ గురించి ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. విషయం ఏంటంటే.. 37 ఏళ్ల తరుణ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

తరుణ్ తల్లి రోజా రమణి చాలా రోజులుగా ఈయనకు మంచి సంబంధం వెతుకుతుందట. అయితే ఎట్టకేలకు ఆ అమ్మాయి దొరికిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ స్నేహితురాలి కూతుర్ని తరుణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ల అమ్మ ఫిక్స్ అయ్యారని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారని అంటున్నారు.