కర్ణిక లంక, కొక్కిరపల్లి గ్రామాలలో పర్యటించిన తాతంశెట్టి నాగేంద్ర

అల్లూరిసీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కర్ణిక లంక, కొక్కిరపల్లి గ్రామాలను పర్యటించిన జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య ముందుగా కర్ణిక లంక చేరుకున్న జనసేన పార్టీ నాయకులు, మండల నాయకులు మసాడి భీమన్న, ఉపాధ్యక్షులు సాగేని ఈశ్వరరావు, గౌరవ అధ్యక్షులు టీవీ రమణ అక్కడ గ్రామస్తులు కలిసి జనసేన జెండా ఆవిష్కరణ చేసి అనంతరం గ్రామస్తులతో గిరిజన ప్రజలనుద్దేశించి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు నలుగురు కి పెన్షన్ కల్పించి 10 మంది కి రక రకాల కారణాలు చెప్పి పెన్షన్లు, రేషన్ కార్డ్స్ తొలగించడం విడ్డూరంగా ఉందని అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ అభివృద్ధి కోసం అడిగితే వాళ్ళు వ్యక్తిగత దూషణలు చేస్తూ కలయాపన చేస్తున్నారని ఇది ఏ రకమైన రాజకీయాలో మీలాంటి యువత ఆలోచించాలని రాష్ట్రములో అరాచక రాజకీయాలకు ప్రత్యామ్నాయ శక్తి కేవలం జనసేన పార్టీ తోనే సాధ్యమని మార్పు కోసం విద్యావంతులైన యువత ప్రజలను చైతన్య పరిచే విదంగా పని చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా పాడేరు, ఆరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మాట్లాడుతూ గతంలో గిరిజన హక్కులు చట్టాలు కోసం పోరాడాను అందుకే గిరిజన హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వంపై గిరిజన ప్రజల తరపున పోరాడుతామని తెలిపారు. అనంతరం చింతపల్లి మండలము పోతురాజుగుమ్మలు, చెరపల్లి గ్రామాలను సందర్శించారు. చింతపల్లి మండల నాయకులు దేపురు రాజు, బుజ్జిబాబు, పండు, రవి, జి.మాడుగుల మండల నాయకులు మసాడి భీమన్న, కార్యదర్శి మురళి, ఉపాధ్యక్షులు ఈశ్వరరావు, టీవీ రమణ, మస్తాన్, రాజు, అంకిత్, పాడేరు మండల నాయకులు అశోక్, సంతోష్, పెదబయలు నాయకులు కళ్యాణ్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.