వాసగిరి మణికంఠను కలసిన టిసి నారాయణరెడ్డి

  • బంగారు కలల ప్రజా సంక్షేమ పథకాల కరపత్రాన్ని జనసేన నేతలకు అందించిన టిసి నారాయణరెడ్డి
  • టిసి నారాయణరెడ్డిని జనసేన పార్టీలోకి ఆహ్వానించిన వాసగిరి మణికంఠ

గుంతకల్అ: నంత జిల్లా జనసేన కార్యదర్శి వాసగిరి మణికంఠను సీనియర్ రైతు సంఘం నేత టిసి నారాయణరెడ్డి శనివారం కలిసారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం పతనానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వ లోపాయిష్ట వ్యవసాయ విధానాలు, ప్రస్తుత ప్రమాదకర పరిస్థితిల్లో వాటిని పరిష్కరించే మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు సంఘం నేత టి సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ సంక్షోభాన్ని, రైతు కష్టాలను పరిష్కరించేందుకు జనసేన పార్టీ కృషి చేయాలని ముఖ్యంగా రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున 5 ఎకరములు వరకు “రైతు కళ్యాణ్” (రైతు మేలు) మే 1వ తేదీన రైతుల ఖాతాలో జమ చేయాలి. పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీలు మంజూరు చేయాలి. మేధావుల సహకారం, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సమన్వయంతో గిట్టుబాటు ధర కొరకు 10 వేల కోట్లు కేటాయించాలి. గతంలో 70 సంవత్సరాల క్రితం ” దున్నే వారిదే భూమి” అనే నినాదం ఉండేది, కానీ ఇప్పుడు దున్నుకో, పంట పండించుకో, పట్టాదారునికి 15% చెల్లించుకో అనేలా పథకం తేవాలి, 60 సంవత్సరాలు దాటిన అవ్వ, తాతలు ఇద్దరికీ 2500 పెన్షన్ మంజూరు, “అమ్మ ఒడి” లాగే “నాన్న ఆలనా పాలన” అనే ఒక పథకాన్ని రూపొందించాలి, చదువుకున్న నిరుద్యోగులకు సంవత్సరానికి 15 వేలు (ప్రోత్సాహక నిరుద్యోగ భృతి) జనసేన పార్టీ మేనిఫెస్టో పొందుపరచాలని కోరుతూ “బంగారు కలల ప్రజా సంక్షేమ పథకాలు” కు సంబంధించి ఒక కరపత్రాన్ని జనసేన నేతలకు అందించారు. రైతు సంఘం నేతలతో వాసగిరి మణికంఠ మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో 75 ఏళ్లుగా, దశాబ్దాలుగా రైతాంగ సమస్యలతో సతమవుతమవుతున్న రైతాంగానికి ఇప్పటికీ పరిష్కారం లభించకపోవడం విచారకరం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జనసేనాని పవన్ కళ్యాణ్ “వారాహి యాత్ర” ద్వారా గ్రామస్థాయి నుండి రైతుల కష్టాలను తెలుసుకొని తీర్చడంలో ముందుంటారని, ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే రైతులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడతానని చెప్పిన మొట్టమొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని వివరించారు, వ్యవసాయమే ఈ దేశ ప్రజల జీవిత విధానమని, రైతులలో గొప్ప శక్తి ఉంది, మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి, ఐక్యంగా కృషి చేస్తే అన్ని సాధించవచ్చునని, రైతు సంఘం నాయకులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని జనసేన పార్టీలోకి వచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని టిసి నారాయణ రెడ్డి గారిని కోరారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ జనసేన పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు బండి శేఖర్, కురువ పురుషోత్తం సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర రైతు సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.