జనసైనికుడు కుల్లాయప్పకు భీమా చెక్కు అందజేసిన టిసి వరుణ్

శింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండలం కేంద్రంలో విరుపాక్షి నగర్ కాలనీకి చెందిన జనసైనికుడు డి. కుల్లాయప్ప ఇటీవల యాక్షిడెంట్ కు గురికావడం జరిగింది. యాక్షిడెంట్ కు గురైన కుల్లాయప్ప జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అతనికి హాస్పిటల్ వైద్య ఖర్చులకు 50 వేల రూపాయలను ఆయన కుటుంబానికి జనసేన జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ చేతులమీదుగా 50 వేల రూపాయల చెక్కు అందించారు. ఈ సందర్భంగా టిసి వరుణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ అధ్యక్షుడు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వారి కుటుంబాలకు ఏ ఆపద వచ్చిన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితుడు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జిల్లా అధ్యక్షుడు టిసి వరుణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్, రాయలసీమ ప్రాంతీయ వీరమహిళ పి పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్సులు డి జయమ్మ, బి పురుషోత్తమ రెడ్డి, అవుకు విజయ్, సింగణమల మండల కన్వీనర్ తోట ఓబులేసు, మొప్పూరి క్రిష్ణ, నగర కమిటీ సభ్యులు మెదర వెంకటేష్, జక్కిరెడ్డి ఆదినారాయణ, కె వెంకటనారాయన, అంజి, హరీష్ రాయల్, నాయకులు బి సాయి శంకర్, సంతోష్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.