ఉమ్మడి అనంతపురం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ గారి పుట్టినరోజు వేడుకలు పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో గోరంట్లలోని స్థానిక గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్‌ను కట్ చేసి టీసీ వరుణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంతోష్, జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి చిలమత్తూరి వెంకటేష్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు పి. వెంకటేష్, నియోజకవర్గ నాయకుడు అనిల్ కుమార్, వీర మహిళా కావేరి, మండల నాయకులు రాఘవేంద్ర, నరేష్, నగేష్, తిరుపాల్, దేవుల చెరువు రమేష్, వెంకటేష్, గాజుల రమేష్, శ్రీరాములు, రాజు, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న టీసీ వరుణ్ గారు మరిన్ని విజయాలను సాధించాలని జనసేన నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.
Share this content:
Post Comment