గుంతకల్ లో అట్టహాసంగా టీసీ వరుణ్ జన్మదిన వేడుకలు

*రైల్వే స్టేషన్ రోడ్ లో పేదలకు వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ..

*అనంత జిల్లాలో పవన్ కళ్యాణ్ ఆశయ సాధకుడిగా టిసి వరుణ్ ను అభివర్ణించిన జనసేన శ్రేణులు…

జనసేనాని, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో జనహృదయనేత, అనంత జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ జన్మదినం సందర్భంగా గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో జనసేన శ్రేణుల సమక్షంలో గుంతకల్ పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డులో పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ ఎదుగుదలకు శక్తివంచన లేకుండా కృషి చేసిన సేవాతత్పరుడు టీసీ వరుణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, వేడుకలకు దూరంగా, బాధ్యతలకు దగ్గరగా సేవా కార్యక్రమాలు జనసేన శ్రేణులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో టీసీ వరుణ్ గారు అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పామయ్య, ఆటో రామకృష్ణ, కథల వీధి అంజి, గాజుల రాఘవేంద్ర, మైనారిటీ నాయకుడు దాదు, రామకృష్ణ, అమర్, విజయ్, శివ, సత్తి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment