టిడిపి, జనసేన ఉమ్మడి ఇంటింటి ప్రచారం

పీలేరు నియోజవర్గం: ముడుపులి వేముల పంచాయతీలో టిడిపి జనసేన ఉమ్మడిగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. పీలేరు నియోజకవర్గం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి పీలేరు మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ ఉప అధ్యక్షుడు గురు మోహన్ కార్యదర్శి గజేంద్ర నరేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు టిడిపి కార్యకర్తలు టిడిపి నాయకులు పాల్గొని ఉమ్మడి ప్రభుత్వం వస్తే పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.