జనసేన మద్ధతుతో ద్రాక్షారామంలో టిడిపి బంద్ విజయవంతం

రామచంద్రపురం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మరియు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం రామచంద్రపురం నియోజకవర్గం, ద్రాక్షారామంలో శాంతియుతంగా చేపట్టిన నిరసనలో సోమవారం ద్రాక్షారామ పోలీసులు జనసేన నాయకులను అరెస్టు చేయడం జరిగింది. నిరసనలో పాల్గొని మద్దతు తెలిపిన జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సంపత్, జనసేన మరియు రామచంద్రపురం మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయకుమార్, రామచంద్రపురం మండల వైస్ ప్రెసిడెంట్ వాసంశెట్టి రమణ, కనితి రాంబాబు, దుళ్ళ కొండయ్య నాయుడు, జడ్డు సతీష్, జడ్డు శంకరం, పల్లాబాలాజీ, కాళ్ళ ప్రసాద్, జనసేన నాయకులు పాల్గొన్నారు.