బీజేపీ నాయకులను కలిసిన టీడీపీ అభ్యర్థి అయితా బత్తుల

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఎన్ డి ఏ కూటమి బిజెపి-జనసేన- తెలుగుదేశం అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు సందర్శించి బిజెపి నాయకులను కలిశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు ఆనందరావు కు శాలువా కప్పి సత్కరించారు. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాడ సోంబాబు రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కర్రి రామస్వామి (దత్తుడు) చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్, బీజే పీ జిల్లా ఉపాధ్యక్షుడు దూరి రాజేష్, బీ జే వై ఎన్ జిల్లా అధ్యక్షులు కొండేటి ఈశ్వర్ గౌడ్, బిజెపి అమలాపురం టౌన్ అధ్యక్షులు వెంపరాల భాస్కర్ శాస్త్రి, బిజెపి సీనియర్ నాయకులు యర్రమిల్లి పాండురంగారావు బీజేవైఎం ఆర్టీఐ సెల్ కన్వీనర్ అరిగేల తేజ వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వర్ రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ రావు, బొర్రా ఈశ్వరరావు, రాయపు రెడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.