*ఎమ్మెల్యే ఆనందరావు ప్రత్యక్ష సర్వే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టిడిపి కార్యక్రమం ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు గారు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి, గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కంకటల రామం, లంకె భీమరాజు, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ, మండల టిడిపి అధ్యక్షుడు అరిగేలా నానాజీ, గ్రామ కమిటీ అధ్యక్షులు బాపండు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా, జనసేన కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Share this content:
Post Comment