గ్రేటర్ ఎన్నికల్లో ఉనికిని కోల్పోయిన టిడిపి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ వచ్చిన ఫలితాలు వల్ల రెండు బలమైన పార్టీలు కాంగ్రెస్,తెలుగుదేశం కూడా ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు 2014 ఎన్నికలప్పటి నుండి క్రమేసి తన బలాన్ని కోల్పోతు వస్తుంది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ పార్టీ 2020 ఎన్నికల్లో కనీసం ఎక్కడా సరైన పోటీ కూడా ఇవ్వలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.అయితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మొదటి నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ముందే కీలక పోటీ కన్పించింది. మిగతా పార్టీలను ఎవ్వరూ లెక్కలోకి తీసుకోలేదు.

అయినా కాంగ్రెస్‌ ఒకటి రెండు స్థానాల్లో తన ఉనికి చాటుకుంది. కానీ తెలుగుదేశం జాడ మాత్రం ఎక్కడా కన్పించ లేదు. గ్రేటర్‌లో తమ ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 106 డివిజన్లలో టీడీపీ తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది. ప్రచారంలో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కనిపించక పోవడం గమనార్హం.

అయితే చంద్రబాబు గారి ప్రచారం ఒక్క సోషల్ మీడియా వరకే పరిమితం అయ్యింది. ట్విటర్ వేదికగా హైదరాబాద్‌ అభవృద్ధిలో టీడీపీ పాత్ర ఎంతో ఉందని గొంత చించుకున్నా ఓటర్లు పట్టించుకోలేదు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో. ఇప్పుడు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు గారు తమ అభ్యర్థులచే విస్తృతంగా ప్రచారం నిర్వహించినా. వారు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయలేకపోయారు. ఎంతో ఈ గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో పార్టీ ఉనికి కాపాడుకోవలసిన సమయం వచ్చింది.