ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి గంటి, అసెంబ్లీ అభ్యర్థి దేవ

  • టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ని గెలిపించండి
  • తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి హరీష్ బాలయోగి
  • జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వర ప్రసాద్

కోనసీమ జిల్లా, అమలాపురం : తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాధుర్ అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని, స్వామి వారి అశీస్సుల అనంతరం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు.. రాజోలు నియోజకవర్గంలో సఖినేటిపల్లి మండలం, అంతర్వేది నుండి ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో హరీష్ బాలయోగితో పాటు, జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరకీ సంక్షేమం అందేలా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తోనే సాధ్యమన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధి సఖినేటిపల్లి లో ప్రతిఇంటికి వెళ్లి, 6 గ్యారంటీల మేనిఫెస్టోను అందజేసి, వాటి గురించి వివరించారు. ప్రజల వెంటే ఉంటూ, ప్రజా సమస్యల పై పోరాడుతున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. తండ్రి జీఎంసి బాలయోగి ఆశయాలను నెరువేరుస్తానని మాటిచ్చారు. ఇంకొన్ని రోజుల్లో అరాచక పాలన పోయి ప్రజాపాలన వస్తుందని ధీమా వ్యక్తం చేసారు హరీష్ బాలయోగి.