చర్మ కార్మికులతో టీ విత్ డాక్టర్ బాబు

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం తాటిపాకలో చర్మ కార్మికులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు తాటిపాక సెంటర్లో ముఖాముఖి చర్చ జరిపి జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ తో టీ ఇచ్చి వారితో సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. చర్మ కార్మికులు వారి ప్రధాన సమస్యలను తెలియజేశారు. చర్మకార్మికులకు షాప్ లు పెట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయాలని వృత్తి పనిముట్ల కల్పన చర్మకార్మికులకు లోన్లు కల్పించడం మొదలైన సమస్యలు తెలియచేసారు. డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ రాబోయే జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ద్రుష్టికి చర్మకార్మికుల సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు గోదావరి జోన్ కోకన్వీనర్ పినిశెట్టి బుజ్జి, జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, మామిడికుదురు మండల అధ్యక్షులుదొడ్డా జయరాం, రాజోలు మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, జనసేన నాయకులు గొల్లమందల పూర్ణభాస్కర్, రావూరి నాగు, గ్రామ శాఖ అధ్యక్షులు పెచ్చెటి అర్జున్ , జనసేన నాయకులు ఉండపల్లి అంజి, శెట్టి శ్రీనివాస్, ఎంపీటీసీ దార్ల లక్ష్మీ కుమారి, జక్కంపూడి శ్రీదేవి, పెనుమాల మహాలక్ష్మి, మెడిచర్ల సత్య, జనసేన నాయకులు పోతకాశీ, కట్న రాజు, బొమ్మిడి మహేష్, సుధ మోహన్ రంగ, కటికిరెడ్డి బుజ్జి, రుద్ర శ్రీను, సారిక అన్నవరం, తటికాయల బాబులు, రాపాక మహేష్, మామిడికుదురు గ్రామశాఖ అధ్యక్షులు ఇంటి మహేంద్ర, కత్రినిపాడు నాగేంద్ర, సర్కిల్ అబ్బాస్, కొల్లాటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.