సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి
  • జనసేన పార్టీ కార్యాలయంలో ఉపాద్యాయులకు ఘన సన్మానం

మదనపల్లి నియోజకవర్గం: సమాజానికి మార్గదర్శకులైన ఉపాద్యాయులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో విశిష్టమైన స్థానం కల్పించడం జరిగిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. ఒక వ్వక్తి సమాజంలో నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు ఉపాధ్యాయులు మార్గదర్శనం తప్పనిసరి అని, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ అన్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మదనపల్లె టౌన్ కమ్మవీధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనికుల చేతుల మీదుగా రిటైర్డ్ ఉపాద్యాయురాలు జంగాల శంకరమ్మ, రిటైర్డ్ ఉపాద్యాయులు జానశాల గురునారాయణ ఆచారి, మణికంఠ నారాయణ, ఉదయగిరి హరినాథ్, సూర్య నారాయణ కృష్ణ మూర్తి, పిసి తిమ్మయ్యలకు పూలమాలలు వేసి దుశ్శాలువతో సన్మానించి స్వీట్స్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా సెప్టెంబరు 5 వ తేదిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు. నేటి సమాజానికి ఉపాధ్యాయులు సూచించి మార్గం ఎంతో అవసరం వుందని, ప్రతి ఒక్కరూ తమకు విద్య బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను జీవితం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ‌