IND VS ENG: 50 ఏళ్ల తర్వాత ఓవల్‌లో మళ్లీ అదరగొట్టారు

నాల్గో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే పరిమితం చేసి 157 పరుగుల తేడాతో భారతజట్టు ఘన విజయం సాధించింది. దీంతో 1971లో అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో ఓవర్‌ మైదానంలో విజయం సాధించిన టీమిండియా.. మళ్లీ 50ఏళ్లకు కోహ్లి సారథ్యంలో ఇంగ్లండ్‌ జట్టుపై విజయాన్ని నమోదు చేసుకుంది.
ఓవర్‌నైట్‌ స్కోర్‌ 77 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ జట్టు 100 పరు గుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. బర్న్స్‌ (50)ను అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే శార్దూల్‌ బౌలింగ్‌ పెవీలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మలన్‌(5) కూడా నిరాశపర్చడంతో ఆతిథ్య జట్టు లంచ్‌ విరామానికి 131 పరుగులకే 2 వికెట్లు కోల్పో యింది. ఆ తర్వాత రెండో సెషన్‌లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఈ సెషన్‌లో ఇంగ్లండ్‌జట్లు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్లు ఆరుగురిని పెవీలియన్‌కు పంపి దాదాపు విజయానికి చేరువ య్యారు. టీ విరామం అనంతరం వెంటనే ఇంగ్లండ్‌ చివరి 2 వికెట్లను కోల్పోవడంతో టీమిండియా విజ యం లాంఛనమైంది. హమీద్‌(63) అర్ధ సెంచరీలకి తోడు కెప్టెన్‌ రూట్‌(36) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఒల్లీ పోప్‌ (2), జానీ బెయిర్‌స్టో (0), మొయిన్‌ అలీ(0) ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగారు. చివర్లో క్రిస్‌ వోక్స్‌(18), ఓవర్టన్‌(10), రాబిన్సన్‌(10) కాసేపు క్రీజులో ఉన్నా.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో విజయం ఖాయమైంది. ఉమేశ్‌ యాదవ్‌కు మూడు, బుమ్రా, జడేజా, శార్దూల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఐదో, ఆఖరి టెస్టు శుక్రవారం(10న) మాంచెస్టర్‌ వేదికగా జరగనుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోహిత్‌ శర్మకు దక్కింది.

స్కోర్‌

బోర్డు.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191, 466, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 290
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి)పంత్‌ (బి)శార్దూల్‌ 50, హమీద్‌ (బి)జడేజా 63, మలన్‌ (రనౌట్‌) మయాంక్‌/పంత్‌ 5, రూట్‌ (బి)శార్దూల్‌ 36, పోప్‌ (బి)బుమ్రా 2, బెయిర్‌స్టో (బి)బుమ్రా 0, మొయిన్‌ అలీ (సి)సూర్యకుమార్‌ (బి)జడేజా 0, వోక్స్‌ (సి)రాహుల్‌ (బి)ఉమేశ్‌ 18, ఓవర్టన్‌ (బి)ఉమేశ్‌ 10, రాబిన్సన్‌ (నాటౌట్‌) 10, ఆండర్సన్‌ (సి)పంత్‌ (బి)ఉమేశ్‌ 2, అదనం 14. (92.2 ఓవర్లలో ఆలౌట్‌) 210 పరుగులు. వికెట్ల పతనం: 1/100, 2/120, 3/141, 4/146, 5/146, 6/147, 7/182, 8/193, 9/202, 10/210 బౌలింగ్‌: ఉమేశ్‌ 18.2-2-60-3, బుమ్రా 22-9-27-2, జడేజా 30-11-50-2, సిరాజ్‌ 14-0-44-0, శార్దూల్‌ 8-1-22-2