‘మా’ లో తీన్ మార్.. ఎన్నికల బరిలో జీవిత రాజశేఖర్

తెలుగు సినిమా నటీనటుల సంఘం `మా` అధ్యక్ష ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల వ్యవహారం మరింత రసవత్తరంగా మారుతోంది. సెప్టెంబర్‌లో జరగనున్న ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకాశ్ రాజు, మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి జీవిత రాజశేఖర్ కూడా దిగనున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ మద్దతుతో ప్రకాశ్ రాజు బరిలోకి దిగుతుండగా.. మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ పోటీలోకి వస్తుండడంతో మా ఎన్నికలు త్రిముఖ పోటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ రాజకీయలను తలపిస్తోన్న మా ఎన్నికలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.