*సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి సంధ్యా రాణి
సాలూరు, “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం సాలూరు పట్టణంలోని 21, 22వ వార్డుల్లో పాల్గొన్నారు. వీధుల్లో పూలవర్షం, మేళతాళాలతో మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంత్రి వివరించారు. ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయో లేదో చెబితే తక్షణమే స్పందిస్తామన్నారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి, వాటిపై చర్చించామని మంత్రి తెలిపారు. సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆమె స్పష్టం చేశారు.
Share this content:
Post Comment