*మండల అధ్యక్షుల పరస్పర శుభాకాంక్షలు, కూటమి విజయానికి అంకితత
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పేరం నాగరాజులు నాయుడు, టీడీపీ సీనియర్ నేత పేరం చిరంజీవులు నాయుడుని, జనసేన మండల అధ్యక్షుడు రామిశెట్టి కిరణ్ కుమార్ మరియు జనసేన నాయకులు కలిసి మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా వారిద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, మండల స్థాయిలో తెలుగుదేశం – జనసేన సమన్వయంపై చర్చించారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పరస్పర అభినందనలు తెలుపుకుని, భవిష్యత్తులో ప్రజలతో మమేకమై పని చేయాలని, గడ్డపై కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా కృషి చేయాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఏర్పేడు మండల జనసేన ఉపాధ్యక్షులు పాడి వంశీకృష్ణ, కావాలి మునికుమార్, మొరస పవన్ కుమార్, నాయకులు పి. శివశంకర్, ఎన్. సురేంద్ర, వి. మోహన్, ఎస్. నవీన్, సుధాకర్, జి. విజయ్, పి. డిస్ని, నాని తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment