నష్టపోయిన పరిశ్రమను తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదుకోవాలి.. మెగాస్టార్

నాగ చైతన్య హీరోగా…సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… ఏ విపత్తు వచ్చినా మొదట స్పందించే సినీ పరిశ్రమేనని..ఇప్పుడు కష్టాల్లో ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

కరోనా వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, నష్టపోయిన పరిశ్రమను తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదుకోవాలని అన్నారు. సినిమాలు తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు. అయినా అభిమానుల నిరాశపర్చకుండా, వినోదాన్ని పంచేందుకు కృషి చేస్తున్నామన్నారు చిరంజీవి.