తెనాలి చందోలు రహదారి నిర్మాణం కోసం వేమూరు జనసేన నిరసన

రోడ్డు కుంగిపోయి వరస ప్రమాదాలు అవుతున్న తెనాలి చందోలు రహదారి పునర్నిర్మాణం చెయ్యాలని ఆదివారం నిరసన కార్యక్రమం వేమూరు జనసేన జిల్లా నాయకులు ఆధ్వర్యంలో జరిగింది. వైసీపీ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి అని జనసేన నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షైక్ ఇస్మాయిల్, జిల్లా కార్యదర్శి చేబ్రోలు బోడియ్య, సోమరౌతు అనురాధ, అమృతలూరు అధ్యక్షులు రమేష్, పెనకుదురుపాడు సర్పంచ్ రమేష్, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, చావలి ఎంపీటీసీ నగేష్, బత్తుల అనిల్, సోమరౌతు బ్రహ్మం, కిరణ్, యశ్వంత్, రాజశేఖర్, మణికంఠ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.