చేతికొచ్చిన పంట నీటి పాలవటంతో కౌలు రైతు ఆత్మహత్య

  • మరో ప్రాణం బలి కాకుండా ప్రభుత్వం తక్షణ రైతులకు పరిహారం అందించాలి.

నెల్లూరు జిల్లా, బోగోలు మండలం, పాత బిట్రగుంట గ్రామంలో పురుగుల మందు తాగి రమణయ్య అనే కౌలు రైతు ఆత్మహత్య. అరుంధతి కాలనిలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా 10 ఎకరాలు సాగు చేసి చేతికి వచ్చిన పంట నీట మునిగిపోవడంతో అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్బంగా జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అక్కడకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానభూతి తెలిపి, బాధితులకు అండగా ఉంటామని. ప్రభుత్వం తరపున పరిహారం అందే వరకూ తోడుగా ఉంటామని.. తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కౌలు రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. గత సోమవారం అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అని కలెక్టర్ ని కలవడం జరిగింది. ప్రభుత్వం కూడా త్వరిత గతిన స్పందించి రైతులను ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకోవాలి. సత్వర పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో దాదాపు 11 వేల ఎకరాలు పంట నష్టపోయింది. అనేక కష్ట నష్టాలకు ఓర్చి పండించిన పంట చేతికందింది అనుకున్న సమయంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు దిగాలు పడి ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. గోదాములు లేక వీధిన ఆరబెట్టిన ఒడ్లు తడిసి అల్లాడుతున్న రైతులకు గిడ్డంగులు ఏర్పరచాలి. దేశంలో 70 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారిలో 90 శాతం కౌలు రైతులే. కౌలు రైతుల గురించి అలోచించి వారి కుటుంబ సభ్యులకు సొంత సంపాదన నుంచి లక్ష రూపాయలు అందిస్తున్న ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ ఒక్కరే అని తెలిపారు. కౌలు రైతుల సంక్షేమం జనసేన పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో కావలి నియోజకవర్గ నాయకులు సుధీర్, రుషి, హేమచంద్ర యాదవ్, షాజహాన్, ప్రశాంత్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.