డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు!

హైదరాబాద్‌లో ఎన్నో ఏండ్ల కిందట నిలిచిపోయిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను పునరుద్ధరించడంపై తెలంగాణ ఆర్టీసీ దృష్టి సారించింది. ఇంటర్ సిటీ సర్వీసుల కోసం 25 బస్సుల కొనుగోలుకు తెలంగాణ ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. రేపట్నుంచి ఈ నెల 11వ తేదీ వరకు టెండరు పత్రాలను కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు అనుమానాల నివృత్తికి కు ఈ మెయిల్ చేయొచ్చు. చీఫ్ మెకానికల్ ఇంజినీర్‌, తెలంగాణ ఆర్టీసీకి స్పీడ్ పోస్టు ద్వారా కూడా రాయవచ్చు అని ఆర్టీసీ పేర్కొంది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఆసక్తి గల గుత్తేదారులతో ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు విధించారు.