చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంవద్ద టెన్షన్ వాతావరణం

ఎన్నికల కమిషన్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాసారని సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అయ్యింది. దీనిపై బండి సంజయ్ స్పందించగా.. తాను ఎలాంటి లేఖ రాయలేదని అన్నారు. ఈ లేఖపై బండి సంజయ్ ఇప్పటికే సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీ వల్లే వరద సాయం నిలిచిందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలప బీజేపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వివాదం సోషల్ మీడియాలో పెద్దది కావడంతో లేఖపై నిజాలు తేల్చుకుందామని సీఎంకు బండి సంజయ్ సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలంటూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో  చార్మినార్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయం నుంచి చార్మినార్ వరకు బైక్ ర్యాలీగా సంజయ్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్దకు రానున్నారు. కాగా బీజేపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయగా…ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో 12గంలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వద్దకు వస్తామని బండి సంజయ్ ప్రకటించారు. కాగా ఈరోజు శుక్రవారం కావడంతో చార్మినార్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది.